Katamarayudu story and reviews

Latest Information | Indian Servers | News | Breaking News |

Don't forget to subscribe to email notifications to get all latest jobs directly to your email daily.

Katamarayudu story and review

‘కాటమరాయుడు’ ‘ఫస్ట్‌’ టాక్‌

హైదరాబాద్‌: పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ సినిమా విడుదలవుతోంది అంటే ఆ సందడే వేరు. ఇక అభిమానుల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. ‘సర్దార్‌గబ్బర్‌ సింగ్‌’ ఆశించిన ఫలితంఇవ్వకపోవడంతో ఆ లోటు భర్తీ చేసేందుకు ఈ సారి పవన్‌కల్యాణ్‌ ‘కాటమరాయుడు’తో థియేటర్లలో సందడి చేయబోతున్నారు. ఇప్పటికే కువైట్‌లో సినిమా షో పూర్తైంది. మరి సినిమా ఫస్ట్‌ టాక్‌ ఎలా ఉంది? తొలి షో చూసిన ప్రేక్షకులు ఏమంటున్నారు? అక్కడి నుంచి అందిన సమాచారం ప్రకారం..
ఈ సినిమాలో పవన్‌కల్యాణ్‌ వన్‌మాన్‌ షో చేశారని సినిమా చూసిన వారు చెబుతున్నారు. ఆయన పాత్ర ఆద్యంతం వినోదం పంచుతుందని.. అత్తారింటికి దారేది తర్వాత ఆ స్థాయిలో ఈ సినిమాలో చాలా చలాకీగా కన్పిస్తాడని అంటున్నారు. సినిమా మొత్తం పవన్‌ పంచెకట్టుతో కన్పిస్తూ అలరిస్తాడు. పాటల్లో డ్యాన్స్‌ల మీద పవన్‌ మరికొంత దృష్టి పెట్టి ఉంటే బాగుండేదన్న మాట విన్పిస్తోంది. శ్రుతి హాసన్‌తో లవ్‌ ట్రాక్‌ చాలా బాగుందని.. అన్నదమ్ముల మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయని చెబుతున్నారు. దర్శకుడు తమిళ మాతృక వీరమ్‌ను పూర్తిగా ఫాలో అయినప్పటికీ పవన్‌కల్యాణ్‌ పాత్రను ప్రత్యేకంగా తీర్చిదిద్దాడని ఇది అభిమానులకు పండగేనని అంటున్నారు. క్లైమాక్స్‌లో అన్నదమ్ముల మధ్య వచ్చే ఎమోషన్‌ సీన్లు అలరిస్తాయని చెబుతున్నారు. మొత్తం మీద ‘కాటమరాయుడు’ అభిమానులకు మంచి వినోదాన్ని అందిస్తాడని చెబుతున్నారు.

News...Technological news...Government Services.... Jobs information...Movies everything is available in our website IndianServers Pls bookmark our site for latest stuff Remember : Indian Servers is the source for more trusted and Authenticated news

Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

one × 3 =